ఏపీకి రానున్న AI వర్సిటీ, డాటా సెంటర్లు

-

ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యుఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు.


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాబోయే రోజుల్లో ఎపి స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు కాబోతోంది. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించాం.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటి, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించాం. అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఎఐ యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నాం. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఎపిలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version