విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి – మంత్రి లోకేష్

-

 

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి అంటూ మంత్రి లోకేష్ కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించండి… ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయండని తెలిపారు. తాజాగా గూగుల్ క్లౌడ్ సిఇఓ, వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు.

nara lokesh

శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారాలోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్,బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో లోకేష్ భేటీ అయ్యారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఎఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.

 

ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్‌లుగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ హబ్ గా తయారవుతోంది. విశాఖపట్నంలో డాటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించాం. పిపిపి మోడ్ లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతం. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version