అఖిల ప్రియ హర్ట్ అయ్యారంట… న్యాయముంది?

-

కొన్ని రోజుల క్రితం టీడీపీకి చెందిన ఇద్దరు నేతల మద్య సీమలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు! టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త కలిసి తనను చంపాలని చూస్తున్నారని మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించడం, పోలీసులు యాక్షన్ తీసుకోవడం తెలిసిందే! ఈ క్రమంలో ఈ గొడవ విషయంలో ఎవరు చెప్పినా తగ్గేది లేదని ఏవీ సుబ్బారెడ్డి చెప్పగా… కావాలనే తమపై బురదజల్లుతున్నారని, తన భర్తకు తనకూ ఎలాంటి సంబందం లేదని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో టీడీపీ అధిష్టాణం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు!! కానీ… జేసీ బ్రదర్స్ ని పలకరించడానికి లోకేష్ సీమకు టూర్ పెట్టేసరికి అఖిల ప్రియ హర్ట్ అయ్యారంట!

అవినీతి కేసులో అరెస్టయిన వ్యక్తిని పరామర్శించడానికి ఆసుపత్రుల వద్ద క్యూలు కడతారు.. పోలీసులతో వాగ్వాదాలకు దిగుతారు! అక్రమాల కేసులో అరెస్టయిన నేతలకు కలవడానికి ప్రోగ్రాంస్ ప్లాన్ చేసుకుని మరీ.. ఎక్కడికంటే అక్కడికి వస్తారు. ముందు అనంతపురం అంటే అక్కడికీ వస్తానన్నారు.. తర్వాత కడప అంటే అక్కడికీ వస్తానన్నారు! కానీ… తమను మాత్రం పట్టించుకోలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు అని అఖిల ఫీలవుతున్నారంట!

అక్కడ ఇంకా ప్రత్యర్ధులు వేరు.. అది పోలీసులు, కోర్టు, జగన్ పరిధిలో ఉన్న వ్యవహారం…. పైగా వారంతా మగాళ్లు! ఇక్కడ తన విషయానికొస్తే ఆడపిల్ల… పైగా ఇక్కడ ప్రత్యర్ధి కూడా టీడీపీ నేతే! అయినా కూడా బాబు కానీ చినబాబు కానీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారని అఖిల ప్రియ హర్ట్ అవుతుందంట.

టీడీపీలో అవినీతి, అక్రమాలు చేసినవారికి ఒక రూలు, దౌర్జనాలు, మర్డర్ ప్లాన్లూ చేశారనే ఆరోపణలు వచ్చిన వారికి ఒక రూలా…? పురుషులకు ఒక రూలు – మహిళలకు ఒకరూలా? అని అనుచరుల దగ్గర ఫీలవుతున్నారని తెలుస్తుంది! ఇంకో అడుగు ముందుకేసి… తనపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చి, అందులో వారి వాటా కూడా ఉందని తేలితే తప్ప తనను పట్టించుకోరా అని కూడా ఆవేదన చెందుతున్నారంట!

దీంతో… ఎలాగూ సీమ టూర్ లో ఉన్నారు కాబట్టి… చినబాబు వారిద్దరినీ కూడా పలకరించి, వారి వారి కుటుంబాలను పరామర్శించి వచ్చేస్తే బాగుంటుందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version