Akunuri murali ias tweets on smita sabharwal leads controversy: స్మితా సబర్వాల్ కు అహంకారం, తల బిరుసుతనం ఉందని ఫైర్ అయ్యారు ఆకునూరి మురళి. ఇలాంటి అహంకారపూరిత , రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మన పాలసీ మేకర్స్ అని తెలిపారు. పార్లమెంట్ చేసిన Persons with Diasabilities Act 1995 చట్టం ఉందని దాని ప్రకారమే ఉద్యోగాలలో రిజర్వేషన్స్ వచ్చాయని ఈవిడకు తెలియదా లేక పార్లమెంట్ నే కించపరిచే గర్వం తలకెక్కిందా? అంటూ ఫైర్ అయ్యారు.
ఇప్పటికే పనిచేస్తున్న ఇద్దరు ఈ మధ్యనే రిటైర్ అయిన ఒకరు PWD IAS అధికారులు ( పేర్లు చెప్పను ) అద్భుత పని తీరు మన కళ్ళకు కనపడుతుంది కదా! అంటూ నిలదీశారు. అస్సలు ఎంత మంది IAS ఆఫీసర్లు క్షేత్రస్థాయి లో తిరుగుతున్నారు ఒక కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పా.. KCR సపోర్ట్ తో దేశంలోనే హెలీకాఫ్టర్లలో తిరిగే ఏకైక IAS ఆఫీసర్ కదా ఆ మాత్రం తల బిరుసుతనం ఉంటుందేమో! అని మండిపడ్డారు.