ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యలో కీలక మార్పులు అమలు చేసేందుకు… చంద్రబాబు నాయుడు సర్కార్ సిద్ధమైంది. దీనికోసం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీన ప్రారంభమయ్య ఇంటర్ విద్యా సంవత్సరం… ఈ సంవత్సరం.. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభం కానుంది.

అయితే ఏప్రిల్ ఏడో తేదీన అడ్మిషన్లు మొదలు చేసి.. ఏప్రిల్ 24వ తేదీ వరకు క్లాసులు నిర్వహించబోతున్నారు. ఈ తరుణంలోని మే నెల చివరి వరకు సెలవులు ఉంటాయి. జూన్ రెండో తేదీన తిరిగి కాలేజీలు స్టార్ట్ అవుతాయి. అంటే మొత్తం 235 రోజులపాటు.. క్లాసులో నడుస్తాయన్నమాట. వేసవి సెలవులు కాకుండా మరో 79 రోజులు హాలిడేస్ ఉంటాయి.