ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం, కాకినాడ, అల్లూరి, శ్రీకాకుళం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు (ఈ రోజు)శనివారం సెలవు ప్రకటించారు.
ముఖ్యంగా తూర్పు గోదావరీ జిల్లాలో భారీ నుంచి.. అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నేడు తూర్పు గోదావరీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ స్థాయిలో వర్ష శాతం నమోదు నేపధ్యంలో సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది యధావిధిగా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు సెలవు ప్రకటించిన రోజులను ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కలెక్టర్.