హైదరాబాద్‌లో గన్స్ అమ్ముతున్న ముఠా అరెస్టు..

-

హైదరాబాద్‌లో గన్స్ విక్రయించేందుకు వచ్చిన ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.వీరి నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లను సాధ్వీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ టీమ్‌లోని కీలక సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు ఎవరి కోసం గన్స్ తీసుకొచ్చారు. తుపాకుల కోసం ఎవరైనా ఈ ముఠాను సంప్రదించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో అంతకుముందు ఎవరికైనా గన్స్ అమ్మారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉండగా, గతేడాది హైదరాబాద్‌లో నకిలీ లైసెన్స్‌లతో సొంతంగా గన్స్ తయారు చేస్తూ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆనాడు 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తెచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version