ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విపరీతంగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు అలాగే గ్రామాలలో ఒకేసారి భూ రిజిస్ట్రేషన్ చార్జీలు 15%… పెంచే యోజనలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

భూమి విలువలు పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల… ఆమోదం వచ్చినట్లు చెబుతున్నారు. ఇక డిసెంబర్ 20వ తేదీన సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డులో సవరణ వివరాలు అంటించబోతున్నారట అధికారులు. డిసెంబర్ 24వ తేదీ వరకు అభ్యంతరాలు అలాగే సలహాలు స్వీకరించనున్నారు ఉన్నతాధికారులు. ఇక ఆ అభ్యంతరాలు అలాగే సలహాలను స్వీకరించి 27వ తేదీన పరిశీలిస్తారు. జనవరి అంటే కొత్త సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి వస్తాయి. దీంతో ఏపీ ప్రజలు షాక్ అవుతున్నారు.