KGBV: విశాఖలో దారుణం..23 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్

-

Alluri District KGBV college: అల్లూరి జిల్లా- కేజీబీవీ కాలేజీలో అమానుష ఘటన తెరపైకి వచ్చింది. ఏకంగా 23 మంది విద్యార్ధినుల జుట్టు కత్తిరించింది కాలేజ్ సిబ్బంది. జుట్టు విరబూసికున్నారని విద్యార్ధినులపై టీచర్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో కస్తూరిబా గాంధీ కాలేజీ సిబ్బంది తీరు..వివాదాస్పదంగా మారింది. అల్లూరి జిల్లా…. కాలేజ్ కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినుల జుట్టు కట్ చేశారు. దీంతో జి.మాడుగుల కేజీబీవీ కాలేజ్ లో ప్రత్యేక అధికారిణి చర్యపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Alluri District KGBV college staff cuts students hair to discipline them

ఉదయం ప్రతిజ్ఞ సమయంలో హాజరు కాలేదని 23మంది విద్యార్థులు జుట్టు ను కొద్దికొద్దిగా కత్తిరించింది సిబ్బంది. ఈ నెల 15 తేదీన కార్తీక పౌర్ణమి రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. జుట్టు విరబోసుకుని తిరుగుతున్నందుకు శిక్ష విధించినట్టు వివరణ ఇచ్చారు ప్రత్యేక అధికారిణి. అయితే.. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు స్టూడెంట్స్. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version