RGV: దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు !

-

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు అయింది. తనపై ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టు లో పిటిషన్ వేశారు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే.. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది న్యాయస్థానం.

rgv

అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. ఇక రేపు విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హై కోర్టు.

ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు చేయకూడదని న్యాయ మూర్తి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమో షన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఈ తరుణంలోనే.. అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version