తెలుగు దేశం పార్టీ ఆఫీసులో మీసాలు తిప్పుకోండని బాలయ్యకు మరోసారి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అంబటి రాంబాబు మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ పై సరైన ఫార్మాట్ లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని..చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆగ్రహించారు.
టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు..రచ్చ అని.. శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలేనేదే టీడీపీ ఉద్ధేశం అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు అవినీతి పై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ రోజైనా సరైన ఫార్మాట్ లో చర్చకు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
చిత్తశుద్ధి ఉంటే రండి చర్చిద్దామని సవాల్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడని.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడని మండిపడ్డారు. మీసం మీ పార్టీలో తిప్పండి బాలకృష్ణ… అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండంటూ చురకలు అంటించారు అంబటి.