పవన్‌, బాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా, జగన్‌ దే విజయం -అంబటి రాంబాబు

-

పవన్‌, బాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా, జగన్‌ దే విజయం అన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబుతో పాటు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.. పవన్‌, చంద్రబాబు, బీజేపీ కలసి పోటీ చేసినా సీఎం జగన్‌ విజయం సాధిస్తారని తేల్చి చెప్పారు అంబటి రాంబాబు.

సినిమాల్లో హీరో అయిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే హీరో అవుతారు అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్.. కామెడీ యాక్టర్ అవుతారని నిరూపించిన వ్యక్తి పవన్ కల్యాణ్‌ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ధ్యేయం ఏమిటి.. సింగిల్ గా పోటీ చేస్తావా? అసెంబ్లీలో అడుగు పెట్టడమా? నీకు క్లారిటీ ఉందా? ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా లేదా సూటిగా చెప్పాలని నిలదీశారు. 175 స్థానాలకు పోటీ చేస్తావా లేదా కనీసం సగం స్థానాలకైనా పోటీ చేస్తావా స్పష్టం చేయాలని సవాళ్‌ విసిరారు అంబటి రాంబాబు. చిరంజీవి పార్టీ పెట్టాడు.. 18 సీట్లు సాధించాడు రాజకీయాల్లో నిలబడలేనని అనుకున్నాడు.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పాలించాలనుకునేవాడు.. చెప్పులు చూపించకూడదు.. చెప్పుల రాజకీయం చేయకూడదని చురకలు అంటించారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version