జూపల్లితో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ భేటీ

-

బీఆర్ఎస్ నుంచి వీడిపోయిన నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఓవైపు కాంగ్రెస్​లో చేరడం ఖాయమని వినిపిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే దాదాపుగా ఈ ఇద్దరూ కాంగ్రెస్​లో చేరడం ఖాయమనైనట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని ఇండియా రాగానే ఈ విషయాన్ని రాష్ట్ర నేతలు ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారట. రాహుల్ సమక్షంలోనే ఈ ఇరువురు చేయిపట్టి నడవనున్నారని టాక్.

అయితే తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఉన్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తాము కేవలం బ్రేక్ ఫాస్ట్ కోసమే మీట్ అయినట్లు ఈ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇటీవలే మల్లు రవితోనూ జూపల్లి కృష్ణారావు సమావేశం అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version