నువ్వు హోం మంత్రి కాకపోతే, సీఎం అవ్వు.. ప్రజలు అనుకుంటే ఏకచిత్రాధిపత్యం సాగించిన ఇందిరా గాంధీ కీ ఓటమి తప్పలేదు… ప్రజలు తలుచుకుంటే మీ కూటమి ని కూకటి వేళ్ళతో పెకలించడం ఖాయం అని అంబటి రాంబాబు అన్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ,మాట్లాడితే ఏం జరుగుతుంది. ప్రస్తుత హోం మంత్రి ,మైక్ ముందే హోం మంత్రి. పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేదు.
తెనాలిలో మీ కూటమి నాయకుడు ఒక దళిత మహిళపై అరాచకం చేసి హత్య చేస్తే ఎందుకు స్పందించలేదు. ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తే లా అండ్ ఆర్డర్ మెయింటన్ అవుతుందా. పోలీస్ అధికారులు చట్టా ప్రకారం ప్రవర్తించకపోతే కాలం మిమ్మల్ని వెంటాడుతుంది. సోషల్ మీడియాలో హద్దు అదుపు లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. మా పార్టీకి చెందిన మహిళ మాజీ మంత్రి పై ఇష్టారాజ్యంగా కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, 78 మంది మహిళల, యువతు లపై దాడులు జరిగాయి. అందులో ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అని అంబటి ప్రశ్నించారు.