తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక మంత్రి కేంద్రంలో ఉన్న బీజేపీతో టచ్ లో ఉన్నట్టు మాకు సమాచారం ఉందని.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే నల్గొండ సమావేశంలో జిల్లా రెడ్డీ ఎమ్మెల్యేలపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మల్లన్న.
రెడ్డీలు బీసీల ఓట్లతో గెలిచారని పేర్కొన్నారు. తాజాగా ఓ రాష్ట్ర మంత్రి పై సెన్షేషన్ కామెంట్స్ చేసారు. ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ మంత్రి భారతీయ జనతా పార్టీ టచ్ లోకి పోయిండనేది సమాచారం. ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం.. ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి.. మహారాష్ట్ర ఎన్నికల తరువాత వచ్చే ఫలితాల తరువాత ఈ దుకాణం పెడుతారట. గతంలో ఏక్ నాథ్ షిండేలా అలా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.