కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రాన్ని కోరాం – మంత్రి అంబటి

-

కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అలాగే.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి లో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉంది…అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయా… పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అంటూ ఆగ్రహించారు. అక్రమంగా అరెస్టు చేశారు అంటున్న వారికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం లేదా?? అని నిలదీశారు. రోజుకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లు చంద్రబాబు తరపున వాదించారు… అంత మేధావులు, సీనియర్ లాయర్లు వచ్చి వాదించినా చంద్రబాబుకు ఊరట లభించ లేదని ఫైర్‌ అయ్యారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు ఊరట ఇవ్వటం లేదు..టీడీపీ లైట్లు ఎప్పుడో ఆరిపోయాయన్నారు. చంద్రబాబు ఎంతో మంది లైట్లు ఆర్పాడని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version