కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారతీయులు మృతి

-

కెనడాలో బ్రిటీష్ కొలంబియా ప్రావెన్స్ లో ఓ శిక్షణ విమానం నేల కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. వారిలో ఇద్దరూ భారతీయులు ఉండటం గమనార్హం. చిల్లీవాక్ సిటీకి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షణలో ఉన్న పైపర్ పీఏ-34 సెనెకా లైట్ వైట్ ఎయిర్ క్రాప్ట్.. ఇవాళ ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. 

ఈ సంఘటనలో ముంబయికి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్, రాముగడె   మృతి చెందారని.. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్లు మినహా ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని.. స్థానిక పోలీసులు దృవీకరించారు. ఈ ఘటనపై కెనడా ట్రాన్స్ పోర్టేషన్ సేప్టీ బోర్డు విచారణ జరుగుతుంది. ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం తెలుసుకున్న వెంటనే 5 అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version