ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లిలో అంబటికి వ్యతిరేకంగా వైసిపి నాయకుల ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల నుంచి వైసిపి నాయకులు, మాజీ సర్పంచ్ లు స్థానిక ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
సత్తెనపల్లిలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని అంబటి అసంతృప్తి నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లో గ్రూపు రాజకీయాలతో వైసిపి చెల్లా చెదురు అయిపోతుంది. పార్టీ ను కాపాడుకునేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం….అధిష్టానం దృష్టికి సత్తెనపల్లిలో వైసీపీ పరిస్థితి తీసుకువెళ్తామని చెప్పారు అంబటి అసంతృప్తి నాయకులు.
కాగా..ఎన్నికల్లో ఏ సీటు ఎవరికి ఇస్తారు అనేది సీఎం జగన్ ఇష్టం అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సత్తెనపల్లి సీటు కోసం ఎవరైనా ప్రయత్నించవచ్చని అన్నారు. కానీ జగన్ దే తుదినిర్ణయం అని తెలిపారు.సీటు సంగతి ఎలా ఉన్నా తాను మాత్రం ప్రాణం ఉన్నంత వరకు సత్తెనపల్లి లోనే ఉంటానని వాక్యానించారు. రేపు సీఎంతో జరిగే ఎమ్మెల్యేల సమావేశం, సాధారణ సమావేశం అని, సంచలన నిర్ణయాలు ఏమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు.