ఫార్ములా ఈ-కారు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉందని అంటున్నారు.
న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారట. ఇక క్వాష్ పిటిషన్ ఇవాళ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఫార్ములా – ఈ రేస్ ఇష్యూ పై గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ – కార్ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డి పైనే అని అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రేసింగ్ రావాలని చాలా ప్రయత్నాలు గతంలోనే జరిగాయని అన్నారు.