వేసవి తరువాత కృష్ణానది నుంచీ నీటిని విడుదల చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగా పంట భూములకు నీటిని విడుదల చేసామని… ఖరీఫ్ ముందుగా ప్రారంభం కావడం వలన నీటి అవసరాలుంటాయి.
పులిచింతల, ప్రకాశం బ్యారేజీల వద్ద కావలసినంత నీరు ఉందని వెల్లడించారు. త్వరగా నారుమళ్ళు, పంటలు వేసుకోవాలని రైతులను కోరుతున్నాం. పట్టిసీమ నుంచీ నీరు తీసుకోవల్సిన అవసరం రాలేదు. 34 టీఎంసీ లు పులిచింతల స్టోరేజీ ఉందన్నారు మంత్రి అంబటి. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల 3 పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. పులిచింతలలో 34 TMCల నీరుఉందని… పట్టిసీమ నుంచి మీరు తెచ్చే అవసరం లేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నీటి కొరతే లేదని చెప్పారు.