BREAKING : మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం.. వీటి పైన చర్చ

-

 

ఇవాళ ఏపీ కెబినెట్ సమావేశం కానుంది. 1 గంటలకు భేటీ కానుంది మంత్రి వర్గం. ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించనున్న కెబినెట్… ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోనుంది. 2014 జూన్ 2 తేదీనాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదించనుంది కెబినెట్… సీపీఎస్ స్థానే తెచ్చిన జీపీఎస్ విధానంలో మార్పులు చేస్తూ కేబినెట్లో ప్రతిపాదనలు చేయనున్నారు.

గురుకులాలు, విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై చర్చించనున్న కేబినెట్… కొత్త పీఆర్సీ వేసే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లల్లో చెల్లించేలా కెబినెట్ ఆమోదం తెలుపనుంది. చిత్తూరు డైరీకి అమూల్ సంస్థకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం… చిత్తూరు డైరీని అమూల్ కు అప్పగించే అంశంపై కేబినెట్లో ప్రతిపాదన పెట్టింది. ఏడాదికి సుమారు రూ. కోటి లీజు ప్రతిపాదనతో అమూల్ కు చిత్తూరు డైరీ అప్పగించే ప్రతిపాదన పెట్టింది. 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా కెబినెట్టులో ప్రతిపాదనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version