కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన.. వృద్ధుడిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న నారాయణ అనే వృద్ధుడు…. అదే ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కుక్క పిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లిన బాలికపై నారాయణ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది ఆ బాలిక. అయితే.. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.