ఏపీ మంత్రి కాన్వాయ్‌ ముందు మందుబాబుల రచ్చ!

-

ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి ఊహించని షాక్‌ తగిలింది. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్‌ ముందు మందుబాబులు వీరంగం సృష్టించారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించి తిరిగి వస్తుండగా కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం మసకపల్లిలో కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు.

An unexpected shock for AP Labor Minister Vasamshetty Subhash

దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టింది గోదావరి వరద ఉధృతి. బ్యారేజీ వద్ద 15. 60 అడుగులకు తగ్గింది నీటిమట్టం. బ్యారేజ్ నుండి 15 లక్షల 94, క్యూసెక్కుల మిగులు జిల్లాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అటు ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version