ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీలను భేటీలకు పిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశానికి ఐదుగురు ఎంపీలు హాజరుకాలేదు. ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
ఢిల్లీలో ధర్నా గురించి జగన్ మాట్లాడారు. అయితే ఈ భేటీకి హాజరుకాని కొంతమంది ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం. అటు పార్లమెంటరీ పార్టీ నేతలతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ నెల 22నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో వైసీపీ ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఘటన పరాకాష్ట అని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులపై పార్లమెంట్లో చర్చ జరగాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారు.