జగన్ పై వెంటనే ట్రంప్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి. ఇవాళ ఆనం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని..గౌతమ్ అధానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని తెలిపారు. అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
జగన్ …ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది… అవినీతి చేయలేదని జగన్ అంటున్నాడని చురకలు అంటించారు. తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలుని అమెరికా కు పంపు అంటూ సవాల్ విసిరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి…. త్వరగా జగన్ ను లాక్కెళ్లాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శునకానందం పొందాడు….అందుకే దేవుడు సరైన శిక్ష వేయబోతున్నాడన్నారు. ఈ అభియోగాలు తేలేవరకు జగన్ వైసీపీ అధ్యక్షుడుగా దిగిపోవాలని డిమాండ్ చేశారు.