5 ఏళ్ల పాపా పై అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన అనంతపురం కోర్ట్..!

-

చిన్నారిపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది అనంతపురం సెషన్ కోర్ట్. గత రెండు నెలల వ్యవధిలో 8 మందికి జీవిత ఖైదు విధించింది సెషన్ కోర్ట్. తాజాగా చిన్నారిపై అత్యాచారం కేసులో కామాంధుడికి కఠిన శిక్ష వేసింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2020లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం నార్శింపల్లి గ్రామంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారి పై అత్యాచారం చేసాడు నిందితుడు. మాయమాటలు చెప్పి మానభంగం చేసాడు ముద్దయి గొల్ల ఆదినారాయణ.

దీనిపై అప్పుడు గోరంట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. కేసు నంబర్ 555/2020 గా నమోదు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న అప్పటి గోరంట్ల సీఐ జయ నాయక్.. కేసు దర్యాప్తు చేసిన అప్పటి దిశ మహిళ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అలాగే 10 మంది సాక్షులను విచారించి ముద్దయికి శిక్ష ఖరారు చేసారు. ముద్దాయి గొల్ల ఆదినారాయణ కి జీవిత ఖైదు ,1000 రూపాయిల జరిమాన విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version