కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి అన్ని తెలిపారు. అలాగే కలెక్టర్ దాడి పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ కరమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు BRS పార్టీ హయంలో జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా. అధికారులపై దాడులను BRS ఎందుకు ఖండించదు. అలాగే దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరమర్శలా అని ప్రశ్నించారు.
ఇక కేటీఆర్ ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చారు అన్న సీఎం.. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయి. అవినీతి పార్టీ అయిన బిజెపిని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బిజెపి నేతలను కలుస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఓటు వేయొద్దని చెప్పడం బిజెపికి సహకరించినట్లు కాదా.. అమృత్ టెండర్ల లో అవినీతి జరగలేదని స్వయంగా వారి మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి చెప్పారు అని సీఎం రేవంత్ అన్నారు.