ప్రకాశం: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కోటీశ్వరులు, కార్పోరేట్ శక్తులు మాత్రమే చట్టసభల్లోకి వెళ్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఏపిలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టకుండా పోలీసులు, కార్యకర్తల్ని అడ్డంపెట్టుకుని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకి చంద్రబాబు వెళ్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేశారని.. మళ్ళీ చంద్రబాబు పైనే 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేసినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు.