ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేసేలా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. కొత్తజిల్లాల ఏర్పాటు కు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు పూర్తయిందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టం అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు హమీ ఇచ్చిన విధంగానే వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని సజ్జలు తెలిపారు. పార్లమెంట్ కేంద్రాలను ఆధారంగా చేసుకుని జిల్లాల విభజన చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని…ప్రజా ప్రయోజనాల అనుగుణంగా మనో భావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేసాం అని ఆయన అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏ క్షణమైనా నోటిఫికేషన్: సజ్జల
-