ఆనంకు అనిల్ కుమార్ సవాల్‌..దమ్ముంటే నాతో తలపడు !

-

ఆనం రామనారాయణ రెడ్డి పై విరుచుకుపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నేను ఆరుసార్లు గెలిచానని అంటున్నావు… పార్టీ గాలి ఉన్నప్పుడే నువ్వు గెలిచావంటూ ఫైర్ అయ్యారు. అది గుర్తుంచుకో… ధైర్యముంటే నాతో తలపడ అంటూ సవాల్‌ చేశారు. నా సవాల్ స్వీకరిస్తావా లేదా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తావా… తేల్చుకో అంటూ ఫైర్‌ అయ్యారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించి టిడిపి నేత సోమిరెడ్డి మాట్లాడారని.. నెల్లూరు నగర అభివృద్ధికి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో లెక్క తీస్తాం ..రా అంటూ నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి కూడా బీద రవిచంద్ర కూడా నా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని… నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నపుడు టిడిపికి ఒక సీటు కూడా రాలేదని విమర్శలు చేశారు. పాదయాత్ర చేస్తున్న మీ నేత ఐదు పదాలు కూడా సరిగా పలకడం లేదని.. కుక్క తోక పట్టుకొని గోదారి వీధినట్లుగా తెలుగుదేశం నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. రవిచంద్ర కు ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

Read more RELATED
Recommended to you

Latest news