మహిళా సంరక్షణ కార్యదర్శుల ఉద్యోగాలపై హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయిస్తామన్నారు హోం మంత్రి అనిత. ఏపీ అసెంబ్లీ రెండవరోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ… 13,816 మంది మహిళా రక్షణ కార్యదర్శులు ఉన్నారన్నారు.
కోర్టులో 7 రిట్ పిటిషన్లు మహిళా రక్షణ కార్యదర్శులు వేసినవి ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం మహిళా రక్షణ కార్యదర్శులను పోలీసు ఉద్యోగాలకు వినియోగించిందని గుర్తు చేశారు హోంమంత్రి అనిత. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయిస్తామన్నారు హోం మంత్రి అనిత. చింతలపూడి ప్రాజెక్టుకి ఉన్న అవరోధాలు పరిష్కరించుకుని 2500 కోట్లు బడ్జెట్ లో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కొంతమంది రైతులు భూసేకరణపై కోర్టుకు వెళ్ళారన్నారు. చింతలపూడి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారని తెలిపారు.