మొలకలచెరువు సమీపంలోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన కేసులో 6 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రెండు జలెటిన్ స్టిక్స్, కారు, ఇనుప పనిముట్ల ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. ఇరువురి పూజారుల మధ్య ఆదిపత్యం కోసమే అభయ హస్త ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారన్నారు.
ఆలయానికి వస్తున్న ఆదాయంపై కన్నువేశారు మరో ఆలయ పూజారి హరినాథ్. విద్యాసాగర్ ఆధీనంలో ఉన్న అభయ హస్త ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తే ఆ స్థానంలో నూతన ఆలయం నిర్మించి ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని పొందాలన్నా దురుద్దేశంతోనే కనుగొండ స్వామి ఆలయ పూజారి హరినాథ్ మరో 5 మందితో కలిసి ధ్వంసం చేశారన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. ఈ ఘటన వెనక ఎలాంటి మతద్వేషాలు, రాజకీయ ప్రమేయం లేదంటూ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేదించిన మదనపల్లి డిఎస్పి కొండయ్య, మొలకలచెరువు సీఐ రాజా రమేష్, ఎస్సై గాయత్రి, పోలీను సిబ్బందిని అభినందించారు ఎస్పీ.