ఏపీలో అందుబాటులోకి రానున్న రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్..!

-

ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయి అని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు. సోమవారం నాటికి 20,000 కేసులకి సరఫరా చేరనుంది. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం చేసాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్దాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్దలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయి.

గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ కు చేరింది. సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుంది. దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుంది. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. వినియోగాన్ని బట్టి తదుపరి నెలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాము అని కమిషనర్ నిషంత్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version