సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ 3 ప్రశ్నలు

-

వాలంటీర్ల డేటా సేకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో వివాదస్పద ట్వీట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్ల వీడియోను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్‌. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికెళ్తోందనేదే అందరి ఆందోళన అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

ఎవరు సీఎంగా ఉన్నా.. డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయని చెప్పారు. అసలు వాలంటీర్ల బాస్ ఎవరు? AP ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించేందుకు వాలంటీర్లకు ఎవరు అధికారం ఇచ్చారు..? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండని డిమాండ్‌ చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news