విశాఖలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం: వైవీ సుబ్బారెడ్డి

-

విశాఖలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కాబోతున్నట్లు ప్రకటన చేశారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో వచ్చే నాలుగైదు నెలల్లో 25 ఎకరాల్లో… మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం చూస్తున్నామని చెప్పారు. ఈనెల 16 నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభంకానుందని… ఇందులో సక్సెస్ అయ్యే వారు ఐపీఎల్ ఆడే అవకాశం ఉంటుందని అన్నారు.

కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై కసరత్తు చేస్తోంది. రెవెన్యూ శాఖ అధికారులతో సి.ఎస్ జవహర్ రెడ్డి సమీక్ష చేశారు. పది రోజుల్లోగా ఉద్యోగుల కోసం ఖాళీ స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు స్థలాల కేటాయింపులపై నివేదిక సిద్ధం చేయాలని సి.ఎస్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news