పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబే – సజ్జల సెటైర్లు

-

పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబే అంటూ వైసీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు పేల్చారు. ప్రతిపక్షాలు అరాచక శక్తుల మూక అని.. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్‌ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వి కారు కూతలు… ఎందుకు అంతలా ఊగటం అంటూ చురకలు అంటించారు.

సందర్భం లేకుండా ఆవేశంగా ఒక డైలాగ్ వేయటం… సినిమా హీరో వేసే డైలాగులకు అభిమానుల నుంచి ఈలలు ఎక్కడైనా కనిపిస్తాయన్నారు. మేం గట్టిగా మాట్లాడితే దాని పై ఇంకో రకంగా రియాక్ట్ అవుతారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబు అని.. అంగళ్ళు, పుంగనూరు దగ్గర చంద్రబాబు ఎలా రెచ్చగొట్టారో ప్రజలు అందరూ చూశారని తెలిపారు సజ్జల. పోలీసులు సంయమనంతో లేకపోతే ఘోరం జరిగి ఉండేదని.. చంద్రబాబు అలాంటి ఘోరం జరగాలనే కుట్ర చేశారని మండిపడ్డారు. తన పై హత్యాయత్నం జరిగిందని సీబీఐ విచారణ చేయాలని ప్రధానికి, రాష్ట్రపతి చంద్రబాబు లేఖ రాశారని ఆగ్రహించారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news