ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో కొత్త పేరు

-

ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. తెరపైకి వచ్చిన బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు వచ్చిందని సమాచారం అందుతోంది. రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారట సుధీర్. బాలం సుధీర్ కు కసిరెడ్డి రూ.50 కోట్లు అందించినట్లు గుర్తించారు. సుధీర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సిట్ అధికారులు.

Another new name emerges in the AP liquor case

ఇది ఇలా ఉండగా, ఏపీ లిక్కర్ స్కామ్ పై తొలిసారి విజయసాయి రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ అన్నారు. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారని పేర్కొన్నారు . ఏ రూపాయి నేను ముట్టలేదని వెల్లడించారు విజయసాయి రెడ్డి. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానన్నారు విజయసాయి రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news