కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యనేతలు, జిల్లా స్థాయి కేడర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ఆత్మహత్యాయత్నం చేశారు.
బోనకల్ మండల మాజీ ఎంపీపీ గుగులోత్ రమేష్ ఆత్మాహత్యాయత్నం ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో రమేష్ పేరు రాగా.. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో రమేష్ తీవ్ర మనస్థాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.