విజయవాడ మహా నగరంకు మరో టెన్షన్ వచ్చింది. నిన్న కురిసిన వర్షానికి బెజవాడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనాలంతా టెన్షన్ పడుతున్నారు. గత ఆరు నెలల కిందట అచ్చం ఇదే తరహాలో వర్షం పడి విజయవాడ మొత్తం మునిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే విజయవాడ ఆ వరద నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో… ఇప్పుడు భారీ వర్షం విజయవాడలో పడింది. దీంతో బిక్కుబిక్కుమంటున్నారు జనాలు.

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని.. చాలా జిల్లాల్లో వర్షపాతం నమోదయింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి, ఆకువీడు, విశాఖ, తిరుపతి, ఇంకొల్లు, శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి, నెల్లూరు, చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, భువనగిరి, ములుగు అలాగే పెద్దపల్లి లాంటి జిల్లాల్లో వర్షం ఇవాళ ఉదయమే మొదలైంది.