ఏపీలో ఇవాళ, రేపు పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర లో ఈ పరిస్థితి ఉంటుందన్నారు. ఇవాళ, 20 ,21,22,23 తేదీల్లో జిల్లా లోఅక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు , ఉరుములు, మెరుపుల అవకాశం ఉందని, 21,22,23 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రజలు ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు, ప్రభుత్వ శాఖలు ముందస్తుగా చర్యలు చేపట్టాయని తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలపై సూచనలు జారీ చేశారు.