సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పెట్టుబడుల అవకాశాలు, పాలసీల గురించి వివరించారు. ఇండియా కి సింగపూర్ పెట్టుబడులు రావాలి. అందుకు ఏపీ గేట్ వే గా ఉంటుందన్నారు. రాయలసీమలో ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, డిఫెన్స్ సంస్థలకు అనుకూలంగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతోందని తెలిపారు.
ప్రపంచంలోనే గౌరవప్రదమైన దేశం సింగపూర్ అని చెప్పవచ్చు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివద్దికి దోహదం కావాలి. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరిగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఐటీ రంగంలో తెలుగు వారు ముందున్నారు. తెలంగాణలో హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించామని తెలిపారు. సింగపూర్ కి ప్రత్యేక స్థానం ఉంది. సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు. సింగపూర్ లో 40వేల మంది తెలుగు వాళ్లు ఉండటం చాలా గర్వంగా ఉందని తెలిపారు.