నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..చంద్రబాబు అరెస్ట్‌ అంశంపైనే చర్చ!

-

ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి వారం రోజులపాటు అంటే ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ మొదట బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 9 గంటలకే ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

AP Assembly Session

అసెంబ్లీ సమావేశాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి… ఎలాంటి అంశాలపై చర్చించాలి అనే దాని పైన ఈ బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు ఎమ్మెల్యేలు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అంశం ఈ అసెంబ్లీ సమావేశాలలో తెరపైకి రానుంది.

దీనిపై వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ జరిగే ఛాన్స్ ఉంది. దానికి తగ్గట్టుగానే రెండు పార్టీలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. నిన్న కేబినెట్లో కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ అంశం పైన ఎమ్మెల్యేలు అందరూ గట్టిగా మాట్లాడాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version