ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ మాజీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి అయినప్పటి నుండి టీటీడీ అయన ఎస్టేట్ గా మారి పోయిందని తెలిపారు.
టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి నీ నియమించుకున్నాడని.. 2020 లో టీటీడీ నిధులను దారి మళ్లించి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు అవినీతి పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అసలు విచారణ టీటీడీ విజిలెన్స్ పై జరగాలన్నారు. ఆ విభాగం ఇన్ని ఏళ్ళు నిద్రపోయింది. ఎంత అవినీతి జరిగిన పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్ లు తీసుకున్నాడు. త్వరలో సీఎం నీ కలిసి పిర్యాదు చేస్తున్నామని తెలిపారు.