ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 3.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ రెడీ అయిందని చెబుతున్నారు. ఈ మేరకు పయ్యావుల కేశవ్… ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతారట.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఇవాళ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది.
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్టు సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.