ఏపీకి గుడ్ న్యూస్.. సాస్కి తొలి విడుత నిధులు విడుదల

-

ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాస్కి 2024-25 ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రత్యేక చొరువతో కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. తొలి విడుత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడుత నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

Kandula Durgesh

సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు కందుల దుర్గేష్. కీలకమైన ప్రాజెక్టులను తగినవిధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చని తెలిపారు. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version