మహారాష్ట్ర కొత్త సీఎం ను ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ హై కమాండ్ చూసుకుంటుందని శివసేన అధినేత ఏక్ నాథ్ శిండే పేర్కొన్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు పర్వాలేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సరైన వ్యక్తినే నియమిస్తారని ఆయన వెల్లడించారు. తాను ఎప్పుడూ సీఎం అవుతానని అనుకోలేదని చెప్పారు. మహాయుతిని గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జేపీసీ మీటింగ్ మధ్యలోనే శివసేన ఎంపీలు వెళ్లి అమిత్ షాను కలవడం గమనార్హం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ మెజార్టీతో గెలిపించారు.