ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు..రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అలాగే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రైతుల అంశాలు, భారీ వర్షాలు ఇలా చాలా అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్లు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి గర్విస్తున్నాను.. మాకు అత్యంత ప్రాధాన్యత అంశం మహిళా సాధికారత అన్నారు. గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించామని తెలిపారు సీఎం జగన్. మరింత ఉజ్వలం భవిష్యత్తు, మరింత సమానత్వం సాధిద్ధామని వివరించారు.