ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 28న జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే శాసన సభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వివిధ పాలనా సంబంధిత అంశాలపై ఈ మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైనా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ మంత్రి వర్గ సమావేశంలోనే మరిన్ని ఇతర కీలక అంశాలపైన సీఎం, మంత్రులు చర్చించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం.. ఏపీ కేబినెట్ భేటీ ఫిబ్రవరి 20వతేదీ చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సి ఉంది. అదే రోజు న్యూఢిల్లీలో సీఎం రేఖా గుప్త ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో 28వ తేదీకి వాయిదా పడింది.