SLBC టన్నెస్ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులను మొదలు పెట్టి ప్రారంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని దుయ్యబట్టారు. అంతేకాదు.. మొన్న సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన నేడు SLBC సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గుర్తించినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలడంతో పనికి వెల్లిన వారిలో 8 మంది ఇరుక్కుపోయినట్టు సమాచారం. ఈ ఘటన పై ట్విట్టర్ వేదిక పై స్పందించారు హరీశ్ రావు. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని.. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు.