నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. CRDA అథారిటీ ప్రతిపాదనలను ఆమోదించనుంది ఏపీ మంత్రివర్గం. అన్నదాత సుఖీభవ, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనుంది కేబినెట్. పలు సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ 11 గంటల తర్వాత ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది.

ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అలర్ట్. ఉచిత బస్సు సౌకర్యం పై కీలక ప్రకటన చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు 15వ తేదీ నుంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. అయితే ఫ్రీ బస్సు జిల్లాకే పరిమితం చేయబోతున్నట్లు అధికారికంగా ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. జిల్లా దాటితే… చార్జీలు వసూలు చేయబోతున్నారని సమాచారం అందుతోంది.